బ్రెజిల్ అమెజాన్‌లో కుప్పకూలిన విమానం.. 14 మంది దుర్మరణం
బ్రెజిల్‌లో ఓ విమానం కుప్పకూలిపోయింది. శనివారం జరిగిన దుర్ఘటనలో దాదాపు 14 మంది మరణించారు. ఫేమస్ టూరిస్ట్ టౌన్‌గా పేరు గాంచిన బార్సెలోస్‌లో తుఫాను కారణంగా అమెజాన్‌లో కూలిపోయింది. బార్సెలోస్ టౌన్‌కి సమీపంలో, వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని మధ్యలోనే ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో ఫ్లైట్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బందితో కలిపి 14 మంది ఉన్నారు. ప్రయాణీకులందరూ స్పోర్ట్స్ ఫిషింగ్ కోసం వచ్చారని, అందరూ బ్రెజిలియన్ పురుషులనేనని ప్రాథమిక విచారణలో భాగంగా అక్కడి అధికారులు గుర్తించారు. అమజోనాస్ రాజధాని మానాస్ నుంచి బయల్దేరిన విమానం బార్సెలోస్ వద్ద కూలింది.ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వేగంగా సహాయక చర్యలు చేపట్టారని గవర్నర్ విల్సన్ లిమా పేర్కొన్నారు.
ఉదయం 5 గంటలకే బయల్దేరిన బృందం
మృతుల కుటుంబాలకు గవర్నర్ విల్సన్ లిమా సంతాపం ప్రకటించారు. విమానం ముందు భాగానికి దట్టమైన చెట్లు తగలడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. ఈ విమానం EMB-110, బ్రెజిలియన్ విమానాల తయారీ సంస్థ ఎంబ్రేయర్, ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ మోడల్ ను తయారు చేసింది. మరోవైపు ప్రమాదంపై బ్రెజిల్ వైమానిక దళం, పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.విమానం కూలిన ప్రాంతంలో రాత్రిపూట టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లకు అనుమతి లేదు. కూలిపోయిన విమానం వద్దకు ఆదివారం ఉదయం 5 గంటలకే మనౌస్ నుంచి ఓ బృందం బయలుదేరింది. మృతదేహాలను మౌనస్‌కి తరలించాక, ఫోరెన్సిక్స్ పరీక్షలకు జరిపి కుటుంబీకులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. అమెజాన్ ఉపనది రియో నీగ్రోలోని బార్సెలోస్‌లో చేపలు పట్టేందుకు అనుకూలమైన సీజన్ కనుక ఫిషింగ్ కోసం తరలివస్తారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి