LOADING...
PM Modi : రెండు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్న మోదీ..స్వయంగా ప్రధానిని ఆహ్వానించిన ముయిజ్జు
.స్వయంగా ప్రధానిని ఆహ్వానించిన ముయిజ్జు

PM Modi : రెండు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్న మోదీ..స్వయంగా ప్రధానిని ఆహ్వానించిన ముయిజ్జు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులకు అధికారిక పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మాల్దీవులకు చేరుకున్నారు. మోదీని స్వాగతించేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తో పాటు ఆ దేశ విదేశాంగ, రక్షణ, ఆర్థిక, హోంశాఖ మంత్రులు కూడా విమానాశ్రయానికి వచ్చారు. గతంలో 'ఇండియా ఔట్‌' నినాదంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఒడిదొడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో,మోదీ తాజా పర్యటనకు విశేష ప్రాధాన్యత లభించింది. మహ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తొలినాళ్లలోనే చైనా అనుకూల విధానాలను చేపట్టి 'ఇండియా ఔట్‌' అనే వాదనను ముందుకు తెచ్చారు. ఈ చర్యల ప్రభావంతో మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సహాయాన్ని మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

మోదీని మాల్దీవులకు ఆహ్వానించిన ముయిజ్జు

దాంతో మే నాటికి దశలవారీగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక దళాలను వెనక్కి పిలిపించారు. అంతేకాకుండా, భారత్‌తో కలిసి మాల్దీవులు చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయాలని కూడా నిర్ణయించారు. ముయిజ్జు పూర్తిగా 'చైనా ఫస్ట్‌' దిశలో సాగారు. కానీ అనంతరం తన వైఖరి కారణంగా ఏర్పడిన ఫలితాలు ముయిజ్జుకు స్పష్టంగా అవగతమయ్యాయి. దాంతో, భారత్‌తో మళ్లీ బంధాలను పటిష్టం చేసుకోవాలని ఆసక్తి చూపారు. గత ఏడాది భారతదేశానికి వచ్చినప్పుడు, మోదీకి మాల్దీవులకు వచ్చేలా ఆహ్వానం కూడా ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాల్దీవులకు చేరుకున్న మోదీ