PM Modi: స్లోవేకియా అధ్యక్ష భవన్‌లో మోదీ ఎదుట చిన్నారుల యోగా.. వైరల్‌గా మారిన వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం స్లోవేకియా చేరుకున్న మోడీకి రాజధాని బ్రాటిస్లావాలో ఘన స్వాగతం లభించింది. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో స్వయంగా ఆయనకు స్వాగతం పలికి,ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ, రాబర్ట్ ఫికోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్-స్లోవేకియా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.
వివరాలు
స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినితో ప్రధాని మోదీ సమావేశం
వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేలా ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం బ్రాటిస్లావాలోని అధ్యక్ష భవన్‌లో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా ప్రదర్శనను వీక్షించారు. చిన్నారులు ప్రధాని మోడీ సమక్షంలో యోగా ఆసనాలు ప్రదర్శించగా, ఆ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీ ఎదుట యోగా చేస్తున్న చిన్నారులు
#WATCH | Prime Minister Narendra Modi and Slovakia's President Peter Pellegrini watch a special session of Yoga, at the Presidential Palace in Bratislava, Slovakia.
— ANI (@ANI) June 15, 2026
(Video: ANI/DD) pic.twitter.com/BQgqEZoVHL
వివరాలు
స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తన పర్యటన విశేషాలను ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటలో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని రాబర్ట్ ఫికోకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్-స్లోవేకియా మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.