Loading...
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ రహస్య డైరీలో సంచలన విషయాలు.. దెయ్యాల దాడుల ప్రస్తావన!
పోప్ ఫ్రాన్సిస్ రహస్య డైరీలో సంచలన విషయాలు.. దెయ్యాల దాడుల ప్రస్తావన!

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ రహస్య డైరీలో సంచలన విషయాలు.. దెయ్యాల దాడుల ప్రస్తావన!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోట్లాది మంది క్రైస్తవులు ఎంతో గౌరవించే పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర, సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆయన స్వయంగా రాసుకున్నవ్యక్తిగత డైరీలో దెయ్యాలు,నరకం,ఆధ్యాత్మిక సంఘర్షణలు,మానసిక వేదనకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నట్లు వెల్లడైంది. పోప్ ఫ్రాన్సిస్‌కు అత్యంత సన్నిహితుడైన కార్డినల్ విక్టర్ మాన్యువల్ ఫెర్నాండెజ్ ఈ 160పేజీల డైరీని 'ది ప్రైవేట్ డైరీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్'పేరుతో పుస్తకంగా ప్రచురించారు. అధికార బాధ్యతలు నిర్వహించే క్రమంలో ఎదురైన ప్రలోభాలు,అంతర్గత సంఘర్షణల కారణంగా తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు ఫ్రాన్సిస్ అందులో పేర్కొన్నారు. తన వల్ల ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా దేవుడే తన ప్రాణాలు తీసుకుంటే బాగుంటుందని ప్రార్థించిన సందర్భాలు కూడా ఉన్నట్లు డైరీలో రాసుకున్నారు.

వివరాలు 

మూడుసార్లు దుష్టశక్తుల దాడి?

ఈ డైరీలో దెయ్యాలకు సంబంధించిన ప్రస్తావనలు ప్రత్యేకంగా కలకలం రేపుతున్నాయి.

తన జీవితంలో మూడుసార్లు దుష్టశక్తుల నుంచి ప్రత్యక్ష దాడులు ఎదుర్కొన్నట్లు పోప్ ఫ్రాన్సిస్ రాసుకున్నారు.

బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్‌గా పనిచేస్తున్న సమయంలో రెండుసార్లు, పోప్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఇలాంటి అనుభవం ఎదురైందని వివరించారు.

2021 జనవరి 24న జరిగిన ఓ భయానక అనుభవాన్ని డైరీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నిప్పులు కురిపించే కళ్లతో, భయంకరంగా కనిపిస్తూనే ఆకర్షణీయమైన రూపంలో ఓ దుష్టశక్తి తనకు ఎదురైనట్లు వర్ణించారు.

వివరాలు 

మూడుసార్లు దుష్టశక్తుల దాడి?

రోమ్‌కు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఓ సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆ సమయంలో ఆ దుష్టరూపం నుంచి విజయగర్వంతో కూడిన ఓ స్వరం వినిపించిందని, 'నాకు కావాల్సిందంతా ఇప్పుడు దక్కించుకున్నా' అని అది చెప్పినట్లు డైరీలో వెల్లడించారు.

ఈ అనుభవాల తర్వాత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని, దాదాపు రెండేళ్లపాటు తీవ్ర భావోద్వేగ సంక్షోభంలో గడిపానని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.

చివరకు 2024లో వర్జిన్ మేరీని తనను కాపాడాలని వేడుకున్నట్లు కూడా డైరీలో రాసుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

చిలీ బిషప్‌ల వ్యవహారంపై పశ్చాత్తాపం

ఆధ్యాత్మిక సమస్యలతో పాటు క్యాథలిక్ చర్చిని తీవ్రంగా కుదిపేసిన లైంగిక వేధింపుల వ్యవహారంపైనా పోప్ ఫ్రాన్సిస్ తన డైరీలో మనసులోని భావాలను వెల్లడించారు.

చిలీకి చెందిన ఓ బిషప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తొలుత ఆయన తోసిపుచ్చారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

అనంతరం తన వైఖరిలోని తప్పును గుర్తించిన ఫ్రాన్సిస్.. సంబంధిత బిషప్‌ను రోమ్‌కు పిలిపించారు.

ADVERTISEMENT

వివరాలు 

చిలీ బిషప్‌ల వ్యవహారంపై పశ్చాత్తాపం

అయితే, ఈ పరిణామాల మధ్య చిలీకి చెందిన బిషప్‌లంతా ఒకేసారి తమ రాజీనామాలను సమర్పించడం ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

2018లో జరిగిన ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ.. చిలీలో పరిస్థితి చూసినప్పుడు తన కాళ్ల కింద భూమి కదిలినట్లుగా అనిపించిందని, అక్కడ ఇంతటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని తాను ఊహించలేదని డైరీలో పేర్కొన్నారు.

అమెరికా ఖండం నుంచి తొలి జెసూట్ పోప్‌గా చరిత్ర సృష్టించిన ఫ్రాన్సిస్.. 2025 ఏప్రిల్ 21న తన 88వ ఏట కన్నుమూశారు.

ఆయన వ్యక్తిగత డైరీ రూపంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT