Page Loader
Indian Americans: అమెరికా ఎన్నికల్లో ఇండియన్‌ అమెరికన్ల సత్తా.. ఆరుగురు ప్రతినిధులతో 'సమోసా కాకస్'
అమెరికా ఎన్నికల్లో ఇండియన్‌ అమెరికన్ల సత్తా.. ఆరుగురు ప్రతినిధులతో 'సమోసా కాకస్'

Indian Americans: అమెరికా ఎన్నికల్లో ఇండియన్‌ అమెరికన్ల సత్తా.. ఆరుగురు ప్రతినిధులతో 'సమోసా కాకస్'

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చూపారు. 2024 ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇది గతంలో ఐదుగా ఉండేది. ఇక ఈ ఏడాది విజయం సాధించిన వారిలో శ్రీ తానేదార్‌, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్‌, సుహాస్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరు తమ రాజకీయ ప్రయాణంలో కొత్త మైలురాయిని చేరుకున్నారు. సమోసా కాకస్‌లో సభ్యుల సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది. ప్రతినిధుల సభకు దారితీసే ఈ విజయాల్లో సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆయన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి మైక్‌ క్లాన్సీని ఓడించారు.

Details

గెలుపొందిన అభ్యర్థులు వీరే 

1) డాక్టర్ అమిబెరా కాలిఫోర్నియాలో 6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఏడోసారి విజయం సాధించారు. 2) రాజాకృష్ణమూర్తి ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇది ఆయనకు రెండవసారి. 3) ప్రమీలా జయపాల్ వాషింగ్టన్‌ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి గెలుపొందారు. 2017 నుండి ఆమె ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. 4)రోఖన్నా కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి విజయం సాధించారు, ఇది ఆయనకు మూడోసారి. 5) శ్రీతానేదార్ మిషిగన్‌లోని 13వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి వరుసగా రెండవ విజయం సాధించారు. 6) సుహాస్ సుబ్రమణ్యం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మైక్‌ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు.