Mexico: డ్రగ్స్ ముఠాలపై మెక్సికో కొరడా.. మరో 37 మందిని అమెరికాకు అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
మాదక ద్రవ్యాల ముఠాలకు చెందిన మరో 37 మంది నేరస్తులను అమెరికాకు అప్పగించినట్లు మెక్సికో రక్షణ శాఖ మంత్రి ఒమర్ గార్సియా వెల్లడించారు. సరిహద్దుల ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్న వీరంతా కరడుగట్టిన నేరగాళ్లని, దేశ భద్రతకు గణనీయమైన ముప్పుగా మారారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విధంగా మొత్తం 92 మందిని అమెరికాకు తరలించినట్లు వివరించారు. కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసిన ఖైదీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య సైనిక విమానంలో మెక్సికో నుంచి అమెరికాకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రంప్ ఒత్తిళ్ల ఫలితం.. డ్రగ్ గ్యాంగ్‌కు చెందిన 37 మంది అమెరికాకు తరలింపు
Mexico sends 37 more drug cartel suspects to US amid Trump attack threats https://t.co/ymQVgWtPB4 pic.twitter.com/7iaM8eyJJV
— Al Jazeera English (@AJEnglish) January 21, 2026