Loading...
Prince and Princess of Wales: ముంబైలో అడుగుపెట్టిన బ్రిటన్ రాజ దంపతులు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?
ముంబైలో అడుగుపెట్టిన బ్రిటన్ రాజ దంపతులు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?

Prince and Princess of Wales: ముంబైలో అడుగుపెట్టిన బ్రిటన్ రాజ దంపతులు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేల్స్ యువరాజు విలియం, యువరాణి కేట్ ముంబైకి చేరుకున్నారు. 2026 ఎర్త్‌షాట్ ప్రైజ్ వేడుకలో పాల్గొనేందుకు మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన రాజ దంపతులు నవంబర్ 16న ముంబైలో అడుగుపెట్టారు. భారత్‌కు చేరుకున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ముంబై నగరానికి సంబంధించిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'హలో ముంబై.. నమస్తే ముంబై' అంటూ విలియం, కేట్ ఓ ఫొటో కరోజెల్‌ను పోస్ట్ చేశారు. ఇందులో ముంబైలోని ప్రసిద్ధ రాజాభాయి క్లాక్ టవర్, ఓవల్ మైదాన్, నగర వీధుల్లో కనిపించే కాళీ-పీలీ ఆటోరిక్షాలు, ముంబై స్కైలైన్ దృశ్యాలు ఉన్నాయి. ఈ ఫొటోల ద్వారా నగరానికి తమ రాకను రాజ దంపతులు తెలియజేశారు.

వివరాలు 

మహారాష్ట్ర పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం

బ్రిటిష్ హైకమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ పర్యటనలో ముంబైలో జరగనున్న ఆరో వార్షిక ఎర్త్‌షాట్ ప్రైజ్ వేడుక అత్యంత కీలకమైన కార్యక్రమం.

వాతావరణ మార్పులపై చర్యలు,పర్యావరణహిత ఆవిష్కరణలు,సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై జరిగే సమావేశాల్లోనూ విలియం,కేట్ పాల్గొననున్నారు.

అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న యువ మార్పు సాధకులతో ముచ్చటించనున్నారు.

మహారాష్ట్ర పర్యటన ముగిసిన అనంతరం న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.

భారత పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో ప్రిన్స్ విలియం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎర్త్‌షాట్ ప్రైజ్ కార్యక్రమాన్ని భారత్‌కు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గత ఆరేళ్లలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచే అత్యధిక సంఖ్యలో ఎర్త్‌షాట్ ఫైనలిస్టులు, విజేతలు ఎంపికయ్యారని వెల్లడించారు.

వివరాలు 

ఎర్త్‌షాట్ ప్రైజ్ లక్ష్యం ఏమిటంటే?

స్థానిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు రూపొందిస్తున్న ఆచరణాత్మక పరిష్కారాలు భారత్‌ను పర్యావరణ ఆవిష్కరణలకు ముఖ్యమైన కేంద్రంగా నిలుపుతున్నాయని ప్రశంసించారు.

సమర్థవంతమైన పర్యావరణ పరిష్కారాలను ముందుగానే గుర్తించి,వాటికి అవసరమైన ప్రోత్సాహం అందించడమే ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రధాన లక్ష్యమని విలియం వివరించారు.

పర్యావరణ సమస్యలకు యువ శాస్త్రవేత్తలు,ఆవిష్కర్తలు రూపొందిస్తున్న పరిష్కారాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎర్త్‌షాట్ ప్రైజ్ లక్ష్యం ఏమిటంటే?

ఈ ఆవిష్కరణలను రూపొందించిన విద్యార్థులు, యువ నాయకులతో నేరుగా మాట్లాడి వారి ఆలోచనలు, ప్రయత్నాలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు.

విలియం, కేట్ దంపతులు కలిసి భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2016లో భూటాన్‌తో పాటు భారత్‌ను సందర్శించారు.

అప్పటి పర్యటనలో ముంబైలోని ఓవల్ మైదాన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజాగా దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి భారత్‌కు వచ్చిన రాజ దంపతుల పర్యటనపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT