
అమెరికా:యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం.. ప్రొఫెసర్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నార్త్ కరోలినా చాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి.
ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వర్సిటీ క్యాంపస్‌లోకి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చొరబడిన దుండగుడు.. సైన్స్ భవనంలో కాల్పులు జరపడంతో ఫ్రొఫెసర్ జిజీ యాన్ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు మూడు గంటల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో మరెవరికి గాయాలు కాలేదు. నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని వర్సిటీ చాన్సలర్ కెవిన్ గుస్కివీజ్ చెప్పారు. వర్సిటీలో కాల్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తుపాకీ కాల్పులలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా ప్రొఫెసర్ మృతి
Associate professor Zijie Yan was shot and killed at the University of North Carolina at Chapel Hill today.#EndGunViolence pic.twitter.com/fxzblD73V2
— Newtown Action Alliance (@NewtownAction) August 29, 2023