LOADING...
Pakistan: భారీ ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల పిలుపు.. పాక్ లో 144 సెక్షన్ విధింపు
పాక్ లో 144 సెక్షన్ విధింపు

Pakistan: భారీ ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల పిలుపు.. పాక్ లో 144 సెక్షన్ విధింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు, ప్రభుత్వం ఆయన సురక్షితంగా ఉన్నారని చెబుతోంది. అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని చూపించలేదు దీనివల్ల ప్రజలలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, మద్దతుదారులు, ఆయన నిజంగా క్షేమంగా ఉంటే ఎందుకు చూపించడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైల్లో ఉన్నారు. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. గత నెల రోజులుగా ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరుతున్నారు.

వివరాలు 

పెద్ద స్థాయి నిరసనలకు పిలుపునిచ్చిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు

దీనివల్ల సోషల్ మీడియాలో, వివిధ వేదికలలో ఆయన హత్యకు గురయ్యారంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి. తాజాగా, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద స్థాయి నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. రావల్పిండిలో సమావేశాలు, సిట్-ఇన్‌లు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించకుండా పోలీసులు సెక్షన్ 144 విధించారు. డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హసన్ వకార్ చీమా ప్రకారం, ఈ సెక్షన్ డిసెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు అమల్లో ఉంటుంది. అయితే, పోలీసులు విధించిన ఈ నిబంధనలను తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తప్పుపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఎందుకు కలవనివ్వడంలేదని పార్టీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement