Page Loader
Racial Attack: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై జాతి వివక్షతో దాడి 
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై జాతి వివక్షతో దాడి

Racial Attack: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై జాతి వివక్షతో దాడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. చరణ్‌ప్రీత్ సింగ్ అనే 23 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. ఈ దాడి సెంట్రల్ అడిలైడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఈ ఘటన July 19వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం,ఇది జాతి వివక్ష ఆధారితంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ దాడి కింటోర్ అవెన్యూలో జరిగింది.సిటీ లైట్ డిస్ప్లేను తన భార్యతో కలిసి చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా అయిదుగురు వ్యక్తులు అక్కడికి చేరుకొని పదునైన ఆయుధాలతో సింగ్‌పై దాడికి దిగారు. వారు ముందుగా ఎలాంటి హెచ్చరిక లేకుండానే ప్రత్యక్షంగా పంచ్‌లు విసిరారు.దాడి చేస్తూ సింగ్‌ను దుర్భాష‌లాడుతూ, "ఇండియన్" అంటూ తిడుతూ దుర్మార్గంగా ప్రవర్తించారు.

వివరాలు 

ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన స్థానిక పోలీసులు

ఈ దాడిలో సింగ్ తీవ్రంగా గాయపడి, రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఈ దారుణ దృశ్యాలన్నీ అతని భార్య తన ఫోన్‌లో చిత్రీకరించింది. దాడి చేసిన వ్యక్తుల కారు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా ఆమె వీడియోలో రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.