జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన
ప్రతిష్టాత్మకంగా జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్నారు. భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగబోయే ఈ సదస్సుకు ఆయన హాజరుకావట్లేదని రష్యా ప్రకటన చేసింది. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ-20 సమావేశాలకు హాజరుకాబోరని అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ శుక్రవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం పుతిన్ కు భారత్‌లో పర్యటించేందుకు ఎటువంటి ప్రణాళికలు లేవని,తమ దృష్టి అంతా ప్రత్యేక సైనిక చర్యపైనే కేంద్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. బ్రిటన్,అమెరికా, చైనా,ఈయూ,ఇటలీ, జపాన్, జర్మనీ లాంటి బలమైన దేశాలతో కూడిన సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. మరో 15 రోజుల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సుకు భారత్ చిరకాల మిత్ర దేశం రష్యా హాజరుకాకపోవడం గమనార్హం.