Page Loader
Vladimir Putin: ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై మాట్లాడేందుకు ట్రంప్‌ను 'ఎప్పుడైనా' కలవడానికి సిద్ధంగా ఉన్న: పుతిన్ 
ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై మాట్లాడేందుకు ట్రంప్‌ను 'ఎప్పుడైనా' కలవడానికి సిద్ధంగా ఉన్న: పుతిన్

Vladimir Putin: ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై మాట్లాడేందుకు ట్రంప్‌ను 'ఎప్పుడైనా' కలవడానికి సిద్ధంగా ఉన్న: పుతిన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ట్రంప్‌తో ఎటువంటి సంభాషణ జరగలేదని పుతిన్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షతన అమెరికా విధానాల్లో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఉక్రెయిన్‌లో విజయాన్ని సాధించబోతున్నామని,సిరియాలో రష్యా ఆశించిన లక్ష్యాలను నెరవేర్చిందని వెల్లడించారు. గురువారం దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్ ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు స్పందించారు. ఈ సందర్భంగా అనేక జాతీయ,అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు వస్తుందన్న ఊహాగానాల మధ్య,పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా గమనించదగినవిగా మారాయి.

వివరాలు 

చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధం: పుతిన్ 

ట్రంప్‌తో తన సమావేశం ఎప్పుడు జరిగే అవకాశముందన్న ప్రశ్నకు పుతిన్, "మా సమావేశం ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. గత నాలుగేళ్లుగా మేము మాట్లాడుకోలేదు. ట్రంప్ సానుకూలంగా ఉంటే, చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉంటాను," అని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం, సిరియా పరిణామాల వల్ల రష్యా బలహీనపడిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు, రష్యా గత రెండేళ్లలో మరింత బలం పొందిందని, స్వతంత్రంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

వివరాలు 

చీఫ్ కిరిల్లోవ్ హత్య ఉగ్రవాద చర్య

పుతిన్ మాట్లాడుతూ,"ఉక్రెయిన్‌లో పరిస్థితులు అనూహ్యంగా మారాయి.యుద్ధక్షేత్రంలో మేము రోజురోజుకు భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.కస్క్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం,కానీ ఖచ్చితమైన సమయాన్ని మాత్రం చెప్పలేను," అని అన్నారు. రష్యా ఆర్మీ అణు విభాగం చీఫ్ కిరిల్లోవ్ హత్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ మాస్కోలో ఉన్నారని, ఇప్పటివరకు ఆయనతో సమావేశం జరగలేదని, త్వరలో మాట్లాడతానని పుతిన్ ప్రకటించారు.