LOADING...
Putin: పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత కట్టుదిట్టం
పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత కట్టుదిట్టం

Putin: పుతిన్‌ హత్యకు కుట్ర.. భద్రత మరింత కట్టుదిట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్'కు ప్రపంచంలోనే అత్యంత బలమైన భద్రతా వలయం ఉన్నప్పటికీ, ఆయనపై హత్యాయత్నం జరిగిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో, కొన్ని నెలల క్రితం నోవ్‌గోరోడ్‌ ప్రాంతంలోని ఆయన ప్రైవేటు నివాసం వద్ద ఈ ప్రయత్నం జరిగినట్లు మాస్కో అధికార వర్గాలు వెల్లడించాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని పేర్కొన్నాయి. ఈ ఘటన అనంతరం రష్యా ఫెడరల్ రక్షణ విభాగం పుతిన్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దాంతో ఆయన బహిరంగ పర్యటనలు గణనీయంగా తగ్గించుకున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఎక్కువ సమయం భూగర్భ భద్రతా కేంద్రాల్లోనే గడుపుతున్నట్లు గూఢచారి వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

పుతిన్‌పై పలుమార్లు హత్యాయత్నాలు

ఆయన ఉండే ప్రాంతంలో మొబైల్‌ ఫోన్లు, అంతర్జాల సౌకర్యం ఉన్న పరికరాలపై పూర్తిగా నిషేధం అమలు చేసినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ వైపు నుంచి వచ్చే డ్రోన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు తనిఖీలను మరింత విస్తరించాయి. మాస్కో నది పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. దేశంలోని కీలక అధికారుల రక్షణను కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడిని నేరుగా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందన్న వార్తలను అమెరికా, ఉక్రెయిన్‌ గూఢచారి వర్గాలు ఖండించాయి. గతంలో కూడా పుతిన్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement