Page Loader
Iran: ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ
ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ

Iran: ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెజ్‌బొల్లా చీఫ్ హత్య కేసులో ఇరాన్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ ప్రముఖంగా వినిపించింది. ఇన్నాళ్లు ఎవరికి కనిపించిన ఆయన తాజాగా బాహ్య ప్రపంచానికి కనిపించారు. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. ఇటీవల ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో ఆయన మరణించినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత, ఇరాన్‌ రహస్యాలను ఇజ్రాయెల్‌కు చేరవేయడం వల్ల ఖానీని అరెస్టు చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది. హెజ్‌బొల్లా చీఫ్ హత్యలో ఖానీ పేరు ఉన్నట్లు కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఒక దశలో ఇంటరాగేషన్ సమయంలో ఆయన కుప్పకూలినట్లు సమాచారం వచ్చింది. అయితే ఇరాన్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది .

Details

ఇస్మాయిల్ ఖానీకి సుప్రీం లీడర్‌ చేత పురస్కారం

దౌత్యవర్గాలు ఈ సమాచారాన్ని పూర్తిగా అవాస్తవమని వెల్లడించాయి. మరోవైపు ఖానీకి సుప్రీం లీడర్ ఖమేనీ చేతులమీదుగా అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇస్మాయిల్ ఖానీ ఇటీవల మరణించిన ఐఆర్‌జీసీ కమాండర్ అబ్బాస్ నీలోఫరుసన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఇరాక్‌లోని కర్బలాలో జరిగింది. ఖుద్స్ ఫోర్స్, ఇరాన్‌కు విదేశాల్లో అవసరమైన ఆపరేషన్లను నిర్వహించే ప్రత్యేక దళం, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, గాజాలో హమాస్, యెమన్‌లో హుతీలకు మద్దతు అందిస్తోంది. 2020లో అమెరికా ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసీం సులేమానిని హత్య చేసిన తర్వాత, ఆ బాధ్యతలను ఇస్మాయిల్ ఖానీకి అప్పజెప్పారు. ప్రస్తుతం గాజా, లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.