Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం.. లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారింది. నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై 130 క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వేగవంతమైన దాడిని ప్రారంభించి, ఒక గంటలో 100 యుద్ధ విమానాలతో 120 లక్ష్యాలను ఢీకొట్టింది. ఈ దాడికి సంబంధించి IDF ప్రతినిధి లెబనాన్‌లో నివసించే ప్రజలకు తదుపరి సూచనల వరకు బీచ్‌లలో లేదా పడవల్లో ఉండరాదని హెచ్చరించారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో కొత్త క్లోజ్డ్ మిలిటరీ జోన్‌ను ప్రకటించారు.
లెబనాన్‌లో 2100 మంది మృతి
IDF ప్రకారం, లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలను ఛేదించేందుకు వివిధ విభాగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో రద్వాన్ దళాలు, సదరన్ ఫ్రంట్ ప్రాంతీయ విభాగాలు, క్షిపణి రాకెట్ దళాలు, ఇంటెలిజెన్స్ విభాగాలున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా కమాండ్ అండ్ కంట్రోల్, ఫైరింగ్ యూనిట్‌ను నాశనం చేయడానికి ఈ దాడి చేపట్టింది. దీంతో పాటు, భూదాడిని మరింత ఉధృతం చేసేందుకు IDF నిరంతరం చర్యలు చేపడుతుంది. ఇకపోతే, ఇజ్రాయెల్ దాడి కారణంగా లెబనాన్‌లో ఇప్పటి వరకు 2,100 మంది మరణించారు. 11,000 మందికి పైగా గాయపడ్డారు. అక్టోబర్ 7తో హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఈ ఏడాది పూర్తి అవుతోంది, .
42వేల మంది మృతి
కానీ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యుద్ధంలో ఇప్పటి వరకు 42,000 మంది మరణించారు. వారిలో 16,000 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇక 97,000 మందికి పైగా గాయపడ్డారు