LOADING...
US: ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట 
ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట

US: ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో విదేశీ విద్యార్థుల పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దాదాపు 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, కొంత ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం తమ పశ్చాత్తాపాన్ని చూపిస్తూ, వీరి చట్టబద్ధ హోదాలను పునరుద్ధరించేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఇటీవల అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక న్యాయవాది వెల్లడించారు. ఈ పరిణామంతో, ట్రంప్‌ సర్కారు విదేశీ విద్యార్థులపై మరింత సున్నితంగా వ్యవహరించనుందని తెలుస్తోంది.