Page Loader
తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట
తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట

తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట

వ్రాసిన వారు Stalin
Jul 04, 2023
07:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌పై తోషాఖానా కేసు ఆమోదయోగ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫరూక్ ఖాన్‌ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌పై తోషాఖానా కేసులో మే 10న అదనపు సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ పలు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణకు సంబంధించిన ఇమ్రాన్ అభ్యంతరాలను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌పై ఐహెచ్‌సీని ఆశ్రయించారు. ఇమ్రాన్ పిటిషన్‌‌పై చేపట్టిన కోర్టు ఆయనకు అనుకూలమైన వ్యాఖ్యలు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సెషన్స్ కోర్టు అభియోగాలను సవాల్ చేస్తూ ఐహెచ్‌సీని ఆశ్రయించిన ఇమ్రాన్