LOADING...
US Election Results: సెనెట్‌లో రిపబ్లికన్ల విజయకేతనం.. ఆధిక్యంలో ట్రంప్
సెనెట్‌లో రిపబ్లికన్ల విజయకేతనం.. ఆధిక్యంలో ట్రంప్

US Election Results: సెనెట్‌లో రిపబ్లికన్ల విజయకేతనం.. ఆధిక్యంలో ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఈసారి సెనెట్‌పై పట్టు బిగించింది. మెజార్టీకి అవసరమైన సీట్లను రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో కూడా రిపబ్లికన్లు ముందంజలో ఉన్నారు. సెనెట్‌లో మొత్తం 100 సీట్లలో 34 స్థానాలకు ఈసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా డెమోక్రట్ల వద్ద ఉన్న ఒక సీటు మెజార్టీ రిపబ్లికన్లకు మారింది. రిపబ్లికన్లు 51 సీట్లను, డెమోక్రట్లు 42 సీట్లను కైవసం చేసుకున్నారు. మరో 7 సీట్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నాయి. ఈ విజయంతో రిపబ్లికన్లకు ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జిల ఎంపిక వంటి అంశాల్లో కీలక పట్టు లభించనుంది.

Details

154 సీట్లను సాదించిన డెమోక్రట్లు

రానున్న సంవత్సరాల్లో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు రిటైర్‌ కానుండటంతో, రిపబ్లికన్లు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు 183 సీట్లను రిపబ్లికన్లు గెలుచుకున్నారు. గతంతో పోలిస్తే ఇది ఒకటి ఎక్కువ. డెమోక్రట్లు 154 సీట్లను సాధించారు. ఇవి ట్రంప్‌కు అనుకూలంగా మారితే, ఆయనకు కాంగ్రెస్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాని పరిస్థితి ఏర్పడే అవకాశముంది.