
Bangladesh Protests: గంటలో రాజీనామా చేయండి.. బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు ఎక్కువయ్యాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును టార్గెట్ చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనకారులు అల్లర్లు సృష్టిస్తున్నారు.
వందలాది మంది నిరసనకారులు, విద్యార్థులు సుప్రీంకోర్టును చుట్టుముట్టడం వల్ల వాతావరణం వేడెక్కింది.
ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు.
details
శాంతించని నిరసనకారులు
అయితే దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని, అదే విధంగా ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలు రావడంతో ఈసారి నిరసనతలు మరింత ఎక్కువయ్యాయి.
నిరసనకారులు కోర్టు వద్దకు చేరుకోవడంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధంతరంగా ఆగిపోయింది.
చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.