
Retired Colonel: గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి (U.N )తరపున గాజాలో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన మాజీ కల్నల్ మహారాష్ట్ర వాసి 46 ఏళ్ల వైభవ్ అనిల్ కాలే రఫా వెళుతుండగా బాంబు దాడిలో సోమవారం మృత్యువాత పడ్డారు.
ఇజ్రాయిల్ - హమాస్ నడుమ గత ఏడు నెలలుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్ రఫా పై నిరంతరం కాల్పులు జరుపుతుంది. హమాస్- ఇజ్రాయిల్ పై జరిపిన దాడులకు ప్రతీకారంగా జరుపుతున్న మారణకాండగా అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ అంగీకరించటం లేదు.
ఇప్పటి వరకు 35 వేలకు పైగా పాలస్తీనా వాసులు, 12 వందల మంది ఇజ్రాయిల్ పౌరులు చని పోయారు.
Details
యూరోపియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
భారతీయ కార్మికుడు విధుల్లో భాగంగా రఫా వెళుతుండగా వాహనంపై బాంబు దాడి జరిగి చని పోయాడని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు సువెలిన్ తెలిపారు.
తీవ్రంగా గాయపడిన అతనిని ఉత్తర గాజాలోని యూరోపియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు.
ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి టుడ్రూస్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ పడే కార్యక్రమాల్లో పర్యవేక్షక బాధ్యతలో వున్న వ్యక్తి దుర్మరణం బాధాకరమన్నారు.
కేవలం ఓ వారం వ్యవధిలో ఇటువంటి సంఘటన జరగటం విచారకరమన్నారు.
Details
స్వాతంత్ర్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసిన ఇజ్రాయిల్
కాగా హమాస్ ను పూర్తిగా నిర్మూలించటం ఇజ్రాయిల్ సాధ్యం కాదనే అమెరికా సహాయక డిప్యూటీ సెక్రటరీ కె. కాంపె బెల్ అభిప్రాయంగా ఉంది.
ఇదిలా ఉంటే తమ 76 వ స్వాతంత్ర్ర దినోత్సవ వేడుకలను ఇజ్రాయిల్ రద్దు చేసింది. ఎప్పు డూ జరిపే టార్చ్ మార్చ్ ఫాస్ట్ ను ఉపసంహరించుకుంది.
ఈ టార్చ్ మార్చ్ ఫాస్ట్ ఆ దేశ టివిలో ప్రత్యక్ష ప్రసారం చేయటం ఆనవాయితీగా ఉంది.
అయితే కొంతమంది తమ పౌరులు ఇప్పటికీ హమాస్ చెరలో బందీలుకు మద్దతుగా అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది.