Rewards: రోజూ 20 నిమిషాలు నడిస్తే ప్రోత్సాహక బహుమతులు
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 04, 2026
11:41 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో బ్రిటన్ ప్రభుత్వం వచ్చే జనవరిలో 'మూవ్‌మెంట్ 26.2' పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు నడిచేలా ప్రోత్సహిస్తారు. రోజుకు 20 నిమిషాలు నడక అలవాటు చేసుకుంటే, నెలాఖరుకు మొత్తం 26.2 మైళ్ల దూరం నడిచినట్లవుతుందని, అది ఒక మారథాన్ పోటీ దూరానికి సమానమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు.
వివరాలు
రివార్డులతో పాటు డిస్కౌంట్ వోచర్లు..
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాలపై ఆసక్తి పెంచడమే ప్రధాన ఉద్దేశమని బ్రిటన్ జాతీయ వైద్య సేవల సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్ జిమ్ మ్యాకీ వెల్లడించారు.
ప్రతిరోజూ 20 నిమిషాల నడక లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రోత్సాహకంగా రివార్డులతో పాటు డిస్కౌంట్ వోచర్లను కూడా అందజేయనున్నారు.