
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై స్పందించిన రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
వాగ్నర్ కిరాయి సైన్యం అధినేత యెవెగ్నీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించింది.ఆయనతో పాటు మరో 10 మంది ప్రయాణిస్తున్న విమానం కూలిన ఘటనపై స్పష్టతనిచ్చింది.
ఈ ఘటనలో తమ పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పింది.ఇదో దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది.
విమాన ప్రమాదంపై వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పుకొచ్చారు.
ప్రిగోజిన్ మరణించారా లేక మరేదైనా కోణం దాగి ఉందా అనే అంశంపై ఫోరెన్సిక్ పరిశోధనలు చేస్తుందని దిమిత్రీ చెప్పారు.
ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.వాగ్నర్ సేనల భవిష్యత్తుపై ప్రస్తుతం ఏమీ చెప్పలేమన్నారు. ఈ నెల 23న 10 మందితో వెళ్తున్న విమానం మాస్కో శివార్లలో కూలిపోయింది.
details
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో ప్రిగోజిన్ ది కీలక పాత్ర
మృతుల్లో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై రష్యా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రాజధాని మాస్కోకు ఉత్తరాన ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఇందులో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గోనీ ప్రిగోజిన్ మరణించినట్లు భావిస్తున్నారు.ఈ మేరకు ప్రయాణికుల లిస్టులో ప్రిగోజిన్ పేరు ఉన్నట్లు ఇప్పటికే రష్యన్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది.
గతంలో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు నమ్మకస్తుల్లో ప్రిగోజిన్ ఒకరు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో ఆయన కీలక పాత్ర పోషించారు.
గత జూన్‌లో ఆయన తన ప్రైవేట్ సైన్యంతో కలిసి పుతిన్‌పై తిరుగుబాటు చేసి సైన్యాన్ని మాస్కోకు మళ్లించారు. దాంతో పుతిన్, ప్రిగోజిన్‌ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.