Russia attacks Ukraine: ఉక్రెయిన్‌పై భీకర దాడి.. 24 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరోసారి భారీ దాడులు చోటుచేసుకున్నాయి. బుధవారం రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్ వ్యాప్తంగా నలుగురు చిన్నారులు సహా 24 మంది మృతి చెందగా.. మరో 60 మంది గాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ దాడులు జరిగాయని ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే శత్రుదేశం నుంచి జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే తమ సేనలు ప్రతిదాడులు చేపట్టాయని రష్యా సైన్యం వెల్లడించింది. రష్యా నుంచి మరో 24 గంటల్లో మెరుపుదాడులు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారమే అంచనా వేశారు. ఆయన హెచ్చరించినట్లుగానే మరుసటి రోజే రష్యా దాడులకు పాల్పడటం గమనార్హం.
వివరాలు
ప్రైలుకీ నగరంలో నలుగురు చిన్నారులు సహా 18 మంది మృతి
ఉత్తర చెర్నిహివ్ ప్రాంతంలోని ప్రైలుకీ నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ దాడి చేసింది.
ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 50 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ విహీవ్సీ్క తెలిపారు.
రాజధాని కీవ్‌తో పాటు మరో మూడు నగరాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో ఆరుగురు మరణించగా.. 10 మంది గాయపడ్డారు.