Loading...
Ukraine: ట్రంప్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి,డ్రోన్ దాడులు
ట్రంప్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి,డ్రోన్ దాడులు

Ukraine: ట్రంప్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి,డ్రోన్ దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాపై ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లతో దాడులను మరింత ఉధృతం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మంగళవారం రాత్రి కలిసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యాలోని పెర్మ్‌ ప్రాంతంలో ఉన్న లూక్‌ఆయిల్‌ రిఫైనరీతో పాటు రియాజన్‌లోని మరో ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ రెండు రిఫైనరీల కలిపిన వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు మూడు కోట్ల టన్నులు ఉండటంతో, వీటిపై జరిగిన దాడులకు ప్రాధాన్యం ఏర్పడింది.

వివరాలు 

డ్రోన్ల దాడుల కారణంగా ఆరుగురికి గాయాలు 

ఈ దాడుల ద్వారా రష్యా సాయుధ దళాలకు అవసరమైన ఇంధన సరఫరాపై ప్రభావం చూపడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలిగించామని ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌, జనరల్‌ స్టాఫ్‌ విభాగం వెల్లడించాయి.

భారీ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రిఫైనరీలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యా యుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నాయి.

అయితే, ఉక్రెయిన్‌ చేసిన ఈ వాదనలను రష్యా ఖండించింది.

దాడులకు గురైన రిఫైనరీలకు ఎలాంటి గణనీయమైన నష్టం జరగలేదని రియాజన్‌ గవర్నర్‌ పావెల్‌ మాల్కోవ్‌ తెలిపారు.

డ్రోన్ల దాడుల కారణంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఆరుగురు గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT