Page Loader
Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్‌.. భారతీయులతో సహా లక్ష మంది లక్ష్యంగా గ్లోబల్ కాల్ సెంటర్ స్కామ్‌ 
రష్యాలో భారీ స్కామ్‌

Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్‌.. భారతీయులతో సహా లక్ష మంది లక్ష్యంగా గ్లోబల్ కాల్ సెంటర్ స్కామ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్‌ సెంటర్ల ముఠాను వెలుగులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో నడిచిన ఈ నెట్‌వర్క్‌ లక్ష మందికి పైగా ప్రజలను మోసగించిందని అధికారులు గుర్తించారు. భారత్ సహా దాదాపు 50కి పైగా దేశాల్లో వీరు బాధితులను టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ఈ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. రష్యా ఎఫ్‌ఎస్‌బీ ప్రకారం, ఈ ముఠాకు లండన్‌లో నివాసముండే జార్జియా మాజీ రక్షణ మంత్రి డి కజెరాశ్‌విలితో సంబంధాలున్నట్లు వెల్లడైంది. కాల్‌ సెంటర్ల ఆపరేటర్లు పెట్టుబడుల స్కీమ్‌లు అని చెప్పి భారీ లాభాలు ఆశ చూపుతూ ప్రజలను మోసగిస్తున్నారు.

వివరాలు 

బాధితుల నుంచి 1 మిలియన్‌ డాలర్లు వసూలు

రోజుకు కనీసం 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8 కోట్లు) వరకు బాధితుల నుంచి వసూలు చేసినట్లు వెల్లడించారు. భారత్‌తో పాటు ఐరోపా సమాఖ్య, యూకే, కెనడా, బ్రెజిల్‌, జపాన్‌ వంటి దేశాల పౌరులను కూడా ఈ ముఠా మోసగించింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఎస్‌బీ దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఇజ్రాయెలీ-ఉక్రెయిన్‌ పౌరుడు సహా పలువురు ఆపరేటర్లను అరెస్టు చేశారు, కాగా ఇజ్రాయెలీ-జార్జియన్‌ పౌరుడు పరారీలో ఉన్నాడు. ఈ ఇద్దరిని ఈ భారీ స్కామ్‌కు సూత్రధారులుగా అధికారులు పేర్కొన్నారు. గతంలోనూ వీరు రష్యాపై నకిలీ ఉగ్ర బెదిరింపులను వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.