Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సైబర్ దాడులకు సిద్ధమైన రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా సైబర్ యుద్ధానికి దారితీస్తోందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కీవ్‌ను బలహీనపరచేందుకు అలాగే యూకేతో సహా నాటో మిత్రదేశాలపై సైబర్ దాడులకు రష్యా సిద్ధమవుతుందన్న సమాచారం బయటకొచ్చింది. రాబోయే నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయం చర్చకు రానుంది. రష్యా సైబర్ యుద్ధ వ్యూహాలు అనూహ్యంగా విస్తరించాయని, వాటి తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదని బ్రిటన్‌కు చెందిన ఒక మంత్రి స్పష్టం చేశారు. సైబర్ దాడుల ద్వారా అస్థిరత, బలహీనతలను మాస్కో లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రష్యన్ సైనిక గూఢచారి విభాగం యూనిట్ 29155 ఈ దాడులకు ముఖ్య బాధ్యత వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.
దక్షిణ కొరియాపై సైబర్ దాడులు
రష్యా గతంలో యూరోపా అంతటా ముఖ్యంగా యూకేపై పలు సైబర్ దాడులు చేసిన అనుభవం ఉంది. ఇటీవలి రోజుల్లో ఉత్తరకొరియా సైనికులు రష్యా భూభాగంలో మోహరించారని, దక్షిణ కొరియాపై సైబర్ దాడులు జరగడం దీని కొనసాగింపు అనిపిస్తుంది. ఈ దాడుల్లో రష్యా అనుకూల గ్రూపులు క్రెమ్లిన్ సహకారంతో పని చేస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపణలు చేసింది. రష్యా దాడులు ప్రభుత్వ, సైనిక కేంద్రాలకు మాత్రమే కాకుండా మౌలిక వనరులు, ప్రైవేటు వ్యాపారాలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సంస్థల డేటా చోరీ, మౌలిక సదుపాయాల భద్రత దెబ్బతినే అవకాశం ఉంది.
నిపుణులు హెచ్చరిక
ఈ నేపథ్యంలో, సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు కలిసి పని చేయాలని నిపుణులు పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఈ దాడులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ మంత్రి పేర్కొన్నారు. రష్యా సైబర్ వ్యూహాలు గ్లోబల్ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. భవిష్యత్తులో ఈ దాడులను అడ్డుకునేందుకు మేల్కొనే సమయం వచ్చిందని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.