
Russian attacks: ఖర్కివ్ నగరంపై రష్యా దాడులు.. ఐదుగురు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ నగరంపై రష్యా సైన్యం తాజాగా గ్లైడ్ బాంబులతో దాడులు చేపట్టింది.
ఈ దాడుల్లో 14 ఏళ్ల బాలిక సహా మొత్తం ఐదుగురు మరణించారు. మరో 47 మంది గాయపడినట్లు తెలిసింది. బాంబు పేలుడుతో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.
ఈ భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తాజా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు.
Details
రష్యా బలగాలను నిలువరించడానికి పశ్చిమ దేశాల నుంచి అనుమతులు
రష్యా వైమానిక దళాల అస్త్రాలను వాటి స్థావరాల్లోనే ధ్వంసం చేసి ఉంటే ఇలాంటి దాడులు జరగకుండా ఉండేదని పేర్కొన్నారు.
రష్యా బలగాలను నిలువరించడానికి అవసరమైన అస్త్రాలను ఉపయోగించేందుకు పశ్చిమ దేశాల నుంచి అనుమతులను కూడా కోరామన్నారు.
ఇక, పశ్చిమ దేశాల విరాళంగా అందిన ఎఫ్-16 యుద్ధ విమానమొకటి రష్యా దాడిలో కూలిపోవడం ఉక్రెయిన్‌లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉక్రెయిన్ దర్యాప్తు ప్రారంభించింది.