Russian cargo ship: ఇంజన్ గదిలో పేలుడు.. మెడిటేరియన్ సముద్రంలో మునిగిన రష్యన్ కార్గో షిప్
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 24, 2024
01:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాకు చెందిన ఓ కార్గో నౌక మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ఇంజిన్ రూమ్‌లో జరిగిన పేలుడుతో సంభవించింది. ఈ విషయం రష్యా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. నౌకలో ఉన్న 16 మంది సిబ్బందిలో 14 మందిని రక్షించగలిగినట్లు, ఇద్దరు సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల సమయానికి సంభవించడంతో, ఇది మరింత చర్చనీయాంశం అయ్యింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి