Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 21 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పరిసర ప్రాంతాలపై రష్యా జరిపిన క్షిపణి దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో 21 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాత్రికి రాత్రే రష్యా ప్రయోగించిన క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా అడ్డుకోలేకపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ వద్ద బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసే సామర్థ్యం ఉన్న ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ పేట్రియాట్ మాత్రమేనని, అయితే దానికి అవసరమైన ఇంటర్‌సెప్టర్ల కొరత ఏర్పడటాన్ని రష్యా అవకాశంగా మార్చుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
రష్యా క్షిపణి ప్రయోగ కేంద్రాలపై లక్ష్యిత దాడులు
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మరింత మందుగుండు సామగ్రి, గగనతల రక్షణ పరికరాలను అమెరికాతో పాటు ఐరోపా దేశాలు అత్యవసరంగా సరఫరా చేయాలని జెలెన్‌స్కీ కోరారు.
అది సాధ్యంకాకపోతే ఉక్రెయిన్‌లోనే పేట్రియాట్ ఆయుధాల తయారీకి సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే రష్యా క్షిపణి ప్రయోగ కేంద్రాలపై లక్ష్యిత దాడులు నిర్వహించేందుకు స్టార్‌లింక్ ఉపగ్రహ సమాచార వ్యవస్థను వినియోగించుకునే అనుమతి కోసం ఎలాన్ మస్క్‌ను సంప్రదించాలని భావిస్తున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు.