Page Loader
Putin India tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌
త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

Putin India tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ప్రెస్‌ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్‌ ప్రకటించారు. అయితే, పర్యటన తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ఈ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పుతిన్‌ భారత్‌ పర్యటన జరగే అవకాశం ఉందని సమాచారం.

వివరాలు 

పుతిన్‌ను ఆహ్వానించిన మోదీ

రష్యాలోని కజాన్‌లో ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, మోదీ పుతిన్‌ను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. గత జులైలో మోదీ రష్యా పర్యటించిన విషయం తెలిసిందే, ఇప్పుడు మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు విదేశీ పర్యటనలు జరగడం జరిగింది. ప్రస్తుతం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో, పుతిన్‌ భారత్‌ పర్యటన వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.