LOADING...
Pakistani Beggars: 24,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా 
24,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా

Pakistani Beggars: 24,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు పాకిస్థానీల‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పాకిస్థానీ ప్ర‌జ‌లు వ్య‌వ‌స్థీకృతంగా యాచ‌న‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల కొన్ని సందర్భాల్లో హింసా కూడా పెరుగుతోందని సమాచారం లభిస్తోంది. అంతేకాక, పాకిస్థానీ యాచకుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్ర‌తిష్ట‌కు భంగం క‌లుగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ ఏడాది సుమారు 24,000 మంది పాకిస్థానీలను సౌదీ అరేబియా డిపోర్ట్ చేసింది. అలాగే, యూఏఈ ప్రభుత్వం పాకిస్థానీ పౌరులపై వీసా పరిమితులను విధించింది. గ‌ల్ప్ దేశాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత పాకిస్థానీలు నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిసింది.

వివరాలు 

యాచకాలను నియంత్రించడానికి 66,000 మంది ఆఫ్‌లోడ్

పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డేటా ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తోంది. క్రమబద్ధంగా సాగుతున్న యాచకాలను నియంత్రించడానికి 66,000 మందిని ఆఫ్‌లోడ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాట్ ముక్తార్ ప్రకారం, బెగ్గింగ్ నెట్‌వర్క్స్ పాకిస్థాన్ ప్రతిష్ఠను నాశనం చేస్తాయని చెప్పారు. ఈ పరిస్థితి గల్ఫ్ ప్రాంతం మాత్రమే కాక, ఆఫ్రికా మరియు యూరోప్ దేశాలలో కూడా నెలకొన్నట్లు ముక్తార్ పేర్కొన్నారు. ముఖ్యంగా, బిచ్చం ఎత్తుతున్నట్లు ఆరోపణల కారణంగా 24,000 మంది పాకిస్థానీలను సౌదీ అరేబియా పంపింది, 6,000 మందిని దుబాయ్ డిపోర్ట్ చేసింది, అలాగే 2,500 మందిని అజర్‌బైజాన్ కి వెనక్కి పంపినట్లు ఆయన చెప్పారు.

Advertisement