LOADING...
Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే.. పాక్‌కు సౌదీ మద్దతు 
భారత్‌తో యుద్ధం జరిగితే.. పాక్‌కు సౌదీ మద్దతు

Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే.. పాక్‌కు సౌదీ మద్దతు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ - సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో (India) ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. పాక్‌-భారత్‌ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ దళాలు మాకు తోడుగా ఉంటాయా? అన్న ప్రశ్నకు ఆయన కచ్చితంగా, ఎలాంటి సందేహం లేదని సమాధానమిచ్చారు. ఈ ఒప్పందం లక్ష్యాన్ని వివరిస్తూ, పాక్‌, సౌదీ ఎవరినీ దురాక్రమణదారులుగా పేర్కొనలేదు. ఈ ఒప్పందం ఇరువురికీ ఒక రక్షణ గోడ లాంటిది. ఒక దేశం మీదా, మరో దేశం మీదా దాడి జరిగితే సంయుక్తంగా ఎదుర్కొంటాం.

Details

పాక్ అణ్వాయుధాలను సౌదీ వినియోగించవచ్చు

దురుద్దేశంతో కుదుర్చుకున్నది కాదు. కానీ ఎవరు తమను బెదిరిస్తే, ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పాక్‌ అణ్వాయుధాలను(Nuclear weapons)సౌదీ కూడా వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఇటీవల కుదిరిన ఈ పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందం(Pak-Saudi Defence Pact) ప్రకారం, ఇరువురిలో ఏ దేశంపై దాడి జరిగినా అది రెండింటిపై దాడిగా పరిగణించి సంయుక్తంగా ఎదుర్కొంటారు. ఈ పరిణామంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థిరత్వంపై ఈ ఒప్పంద ప్రభావాలను సమీక్షిస్తున్నామని తెలిపింది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో ఎప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఇప్పుడు పాక్‌-సౌదీ రక్షణ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.