Page Loader
Scandinavian Airlines: విమానంలో బతికిన ఎలుక.. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ 
విమానంలో బతికిన ఎలుక.. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

Scandinavian Airlines: విమానంలో బతికిన ఎలుక.. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానంలో అందించిన ఆహారంలో బతికున్న ఎలుక చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. ఓ విమానం ఇటీవల నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది సమయంలో ప్రయాణికులకు ఆహారం అందించారు. అయితే ఒకరి ఆహారంలో బతికున్న ఎలుక ప్రత్యక్షమైంది. అది బయటకు దూకడంతో విమానంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని వెంటనే పైలట్‌కు తెలియజేయడంతో అతను విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది.

Details

భవిష్యతులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం

ఈ ఘటనపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. సాధారణంగా, విమానాల్లో ఎలుకలు వంటి జంతువులను నివారించేందుకు ఎయిర్‌లైన్ సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరిచిందని నెటిజన్లు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, మరల ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సదరు ఎయిర్ లైన్స్ వివరణ ఇచ్చింది.