South Korea: మరో జెజు ఎయిర్ విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నడుమ మరో ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది.
జెజు ఎయిర్‌కు చెందిన మరో విమానంలో ల్యాండింగ్ గియర్‌లో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
జెజు ఎయిర్‌ఫ్లైట్ 7C101 సోమవారం ఉదయం సియోల్‌లోని గింపో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెజు ద్వీపానికి బయలుదేరిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గియర్ సమస్య కారణంగా తిరిగి గింపోకు ల్యాండ్ అయింది.
టేకాఫ్ తర్వాత సమస్యను గుర్తించగానే, విమానయాన సంస్థ తక్షణ నిర్ణయంతో విమానాన్ని వెనక్కి తీసుకువచ్చింది.
జెజు ఎయిర్‌కు ఉన్న 41 విమానాల్లో 39 బోయింగ్ 737-800 రకానికి చెందినవే కావడంతో ఈ తరహా ఘటనలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి.
వివరాలు
బోయింగ్ జెట్ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది
ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో, జెజు ఎయిర్‌కు చెందిన మరో బోయింగ్ 737-800 జెట్ థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని ముయాన్‌కు బయలుదేరింది.
ల్యాండింగ్‌కు కేవలం అయిదు నిమిషాల ముందు విమానం రన్‌వేపై జారుతూ నిప్పురవ్వలు చిమ్మి రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మినహా మిగతా ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడలేదు.
15 ఏళ్ల పాతదైన ఈ బోయింగ్ జెట్ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఈ తరహా విమానాలు 101 ఉన్నాయని, వాటిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.