LOADING...
PIA: పీఐఏ ప్రైవేటీకరణకు షాక్.. బిడ్ ఉపసంహరించుకున్న ఫౌజీ ఫెర్టిలైజర్
పీఐఏ ప్రైవేటీకరణకు షాక్.. బిడ్ ఉపసంహరించుకున్న ఫౌజీ ఫెర్టిలైజర్

PIA: పీఐఏ ప్రైవేటీకరణకు షాక్.. బిడ్ ఉపసంహరించుకున్న ఫౌజీ ఫెర్టిలైజర్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేటీకరణ దిశగా ముందుకెళ్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు అనుకోని ఆటంకం ఎదురైంది. పీఐఏలో 75 శాతం వాటా కొనుగోలు చేసేందుకు బిడ్ వేసిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ చివరి క్షణంలో తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీంతో ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో కీలక మలుపు ఏర్పడింది. పీఐఏ ప్రైవేటీకరణకు సంబంధించి మొత్తం నాలుగు సంస్థలు ముందస్తు అర్హత సాధించగా,వాటిలో ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. అయితే, తప్పనిసరిగా చెల్లించాల్సిన నగదు డిపాజిట్‌కు గడువు ముగిసే సమయానికి, ఈ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

ఐఎంఎఫ్ షరతుల నేపథ్యంలో సంస్కరణల అమలుకు సిద్దమైన పాక్ సర్కార్ 

ఈ పరిణామంతో ప్రస్తుతం మిగిలిన మూడు సంస్థలే బిడ్డింగ్ రేసులో కొనసాగుతున్నాయి. వీరంతా డిసెంబర్ 23వ తేదీ లోపు తమ సీల్డ్ బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని పాకిస్థాన్ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, క్షీణించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆర్థిక సహాయం పొందుతోంది. అయితే, ఈ నిధుల విడుదలకు ప్రతిఫలంగా ఐఎంఎఫ్ సూచించిన సంస్కరణలను అమలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది. ఈ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించాలనే కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement