Pakistan Bus crash: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు, 40 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, మరణించిన వారిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున బలోచిస్థాన్-ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల సరిహద్దుకు సమీపంలోని దారాసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అదుపు కోల్పోయిన బస్సు లోతైన లోయలోకి పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు.
వివరాలు
కొనసాగుతున్న దర్యాప్తు..
క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఈ బస్సు మార్గమధ్యంలో మరో బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, అందులో ఉన్న ప్రయాణికులను కూడా ఇందులోకి ఎక్కించుకున్నారు. దీంతో బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోయిందని అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటమే బస్సు నియంత్రణ కోల్పోవడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.