Pakistani gangster: ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందంటూ షహజాద్ భట్టీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2024లో పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ రోజెర్ సంధూ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ పేరు వెలుగులోకి రావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో చోటుచేసుకున్న పలు దాడుల వెనుక కూడా షహజాద్ భట్టీ హస్తం ఉన్నట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. గతంలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్య కేసులో కూడా అతడి పేరు వినిపించింది.
వివరాలు
భారత్‌లో దాడులకు ప్రణాళికలు
ప్రస్తుతం అతడు దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2024లో పంజాబ్‌లోని యూట్యూబర్ రోజెర్ సంధూ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన వెనుక కూడా షహజాద్ భట్టీ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా అతడు సోషల్ మీడియా వేదికగా మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని, వాటి ద్వారా దేశంలోని యువతను తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా షహజాద్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్‌లకు చెందిన తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
సైనిక స్థావరాలపై కాల్పులు జరపాలని ఆదేశాలు
వీరికి ఢిల్లీ సహా దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లు, రద్దీ ప్రాంతాలు, అలాగే హరియాణాలోని సైనిక స్థావరాలపై కాల్పులు జరపాలని షహజాద్ ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో షహజాద్ భట్టీ తమ ముఠా ప్రపంచవ్యాప్తంగా 16 నుంచి 17 దేశాల్లో విస్తరించి ఉందని పేర్కొన్నాడు. దాదాపు 300 మంది యువకులు తనతో కలిసి పనిచేస్తున్నారని కూడా అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కూడా అతడికి సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షహజాద్ భట్టీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.