
Japan: జపాన్ ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పనున్న షిగేరు ఇషిబా
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ రంగ టెలివిజన్ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) కూటమి పార్లమెంట్ ఎగువ సభలో మెజార్టీ కోల్పోవడం ఈ పరిణామానికి కారణమైంది. షిగేరు ఇషిబా రాజకీయ ప్రస్థానం ప్రారంభానికి ముందు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు.
Details
29 వయస్సులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టిన అనుభవం
1986లో 29 ఏళ్ల వయసులో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచారు. ఈ కారణంగా కిషిద ప్రభుత్వంలో ఆయనను పక్కనబెట్టారు. గతంలో ఎల్‌డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్ష పదవికి ఐదు సార్లు పోటీ చేసిన అనుభవం ఆయనకు ఉంది.