Loading...
Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చే యత్నం.. బయటకొచ్చిన షాకింగ్ వీడియో
ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చే యత్నం.. బయటకొచ్చిన షాకింగ్ వీడియో

Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చే యత్నం.. బయటకొచ్చిన షాకింగ్ వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో చోటుచేసుకున్న తీవ్ర ఘటనకు సంబంధించిన కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్‌లో జరిగిన దాడి, అనంతరం విమానంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ను ప్రయాణికులు, సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ దృశ్యాలు రికార్డైనట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఒకరు తన మొబైల్ ఫోన్‌తో కాక్‌పిట్ సమీపం నుంచి ఈ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై యూఏఈ అధికారులు ఉగ్రవాద కార్యకలాపాలు లేదా ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు 

ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు 

వీడియోలో ప్రయాణికులు ఇంగ్లిష్,హీబ్రూ భాషల్లో పెద్దగా అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.

''అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు''అని ఓ ప్రయాణికుడు చెప్పడం కూడా రికార్డైంది.

కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన కో-పైలట్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది.

ఘటన సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా ఎత్తు కోల్పోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కాక్‌పిట్‌లో ఉన్నవారు బయటకు రావాలని, ప్రశాంతంగా ఉండాలని కొందరు సూచిస్తుండగా.. క్యాబిన్‌లోని ప్రయాణికులను తమ సీట్లలోనే కూర్చోవాలని సిబ్బంది కోరారు.

ఈ గందరగోళ పరిస్థితుల్లో''ఎవరైనా డాక్టర్ ఉన్నారా?'' అని సిబ్బందిలో ఒకరు గట్టిగా అడిగారు.

దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన దంత వైద్యుడు డాక్టర్ షోటా ముసయెవ్ ముందుకు వచ్చి కాక్‌పిట్ వైపు వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తుంది.

వివరాలు 

కో-పైలట్ తనపై పలుమార్లు కత్తితో దాడి: కెప్టెన్ స్మిత్ మచ్చర్

అప్పటికే తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ వెలుపల రక్తపు మడుగులో పడివున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి.

కో-పైలట్ తనపై పలుమార్లు కత్తితో దాడి చేసినట్లు కెప్టెన్ చెప్పడం వినిపిస్తుంది.

గాయపడిన చేతిని కదపగలుగుతున్నానని, అయితే పిడికిలి బిగించలేకపోతున్నానని ఆయన తెలిపారు.

తీవ్ర గాయాల మధ్య కూడా కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు.

దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

విమానం భారీగా ఎత్తు కోల్పోయిన సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

అనంతరం విమానంలో ఉన్న ఇతర సిబ్బంది, ప్రయాణికుల సహకారంతో పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి మళ్లించారు.

ADVERTISEMENT

వివరాలు 

అత్యవసర ల్యాండింగ్ అనంతరం వైద్య సిబ్బంది కెప్టెన్‌కు చికిత్స

అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 174 మంది ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

అత్యవసర ల్యాండింగ్ అనంతరం వైద్య సిబ్బంది కెప్టెన్‌కు చికిత్స అందించారు.

మరోవైపు, దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ చేతులను వెనక్కి కట్టి నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి.

అతడి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్లు తెలుస్తోంది. ''ఇతను టెర్రరిస్ట్.. పోలీసులు వచ్చే వరకు విమానం నుంచి బయటకు పంపొద్దు'' అంటూ కొందరు ప్రయాణికులు, సిబ్బంది పట్టుబట్టినట్లు వీడియోలో వినిపిస్తుంది. ''అతను ఎక్కడికీ వెళ్లలేడు.. ఇక్కడే మాతో ఉంటాడు'' అని మరో వ్యక్తి గట్టిగా చెప్పడం కూడా రికార్డైంది.

ADVERTISEMENT

వివరాలు 

సౌదీ అరేబియా ప్రాథమిక దర్యాప్తు

అయితే ఘటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.

ఫ్లైదుబాయ్ కూడా దర్యాప్తు పూర్తయ్యేలోపు ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది.

ఈ ఘటనపై సౌదీ అరేబియా ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది.

అందులో కో-పైలట్ కెప్టెన్‌పై దాడి చేయడంతో ఇద్దరు గాయపడినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అనంతరం ఇద్దరు పైలట్లను యూఏఈకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం కో-పైలట్‌ను యూఏఈకి అప్పగించగా.. విమానాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందా? దాని వెనుక ఉగ్రవాద ఉద్దేశం లేదా ముందస్తు ప్రణాళిక ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ ఉగ్ర కుట్రకు సంబంధించిన వెలుగులోకి కొత్త వీడియో

ADVERTISEMENT