Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. హైస్కూల్ విద్యార్థి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.పెర్రీ,అయోవాలోని ఓ స్కూల్ లో, గురువారం ఉదయం నగరంలోని హైస్కూల్‌లో ఓ టీనేజర్ తుపాకీతో కాల్పులకు దిగడంతో ఓ 11ఏళ్ళ విద్యార్థి మృతి చెందగా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు నలుగురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజునే ఈ కాల్పులు జరిగాయి. డల్లాస్ కౌంటీ షెరీఫ్ ఆడమ్ ఇన్ఫాంటే మాట్లాడుతూ.. స్కూల్ ప్రారంభం కావడానికి ముందే కాల్పులు జరిగాయి. ఈ సమయంలో పెర్రీ హైస్కూల్‌లో విద్యార్థులు, అధ్యాపకులు తక్కువగా ఉన్నారని చెప్పారు.
దాడులకు పాల్పడింది,17 ఏళ్ల టీనేజర్
ఈ దాడులకు పాల్పడింది,17 ఏళ్ల టీనేజర్ అని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడు స్వయంగా తుపాకీతో కాల్చుకుని మరణించాడని తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ఐఈడీ బాంబు దొరికింది. కాల్పుల జరిగిన సమయంలో స్కూల్‌లోనే ఉన్న జాండర్ షెల్లీ ఆ భయానక సంఘటన గురించి మీడియాతో చెప్పింది. కాల్పుల శబ్దం వినగానే తాను తరగతి గదిలోకి వెళ్లి దాక్కున్నట్టు పేర్కొనింది. తరువాత బయటకు వచ్చి చూస్తే అక్కడంతా పగిలిన గాజు ముక్కలు, రక్తం మరకలు కనిపించాయని తెలిపింది.