Page Loader
Baltimore bridge collapse: బాల్టిమోర్ వంతెన ప్రమాదంలో ఆగిన గాలింపు చర్యలు .. ఆరుగురి మృతి 
బాల్టిమోర్ వంతెన ప్రమాదంలో ఆగిన గాలింపు చర్యలు .. ఆరుగురి మృతి

Baltimore bridge collapse: బాల్టిమోర్ వంతెన ప్రమాదంలో ఆగిన గాలింపు చర్యలు .. ఆరుగురి మృతి 

వ్రాసిన వారు Stalin
Mar 27, 2024
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

బాల్టిమోర్ నగరంలోని 2.57కి.మీ పొడవున్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో గల్లంతైన ఆరుగురు నిర్మాణ కార్మికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు యుఎస్ అధికారులు తెలిపారు. తప్పిపోయిన కార్మికుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్లను కూడా బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. మీడియా నివేదికల ప్రకారం,కుప్పకూలిన తరువాత ఎనిమిది మందిని పటాప్స్కో నదిలో పడిపోగా ఇప్పటి వరకు ఇద్దరిని రక్షించారు. వంతెనను ఢీకొట్టింది సింగపూర్‌కు చెందిన సినెర్జీ మెరైన్‌ గ్రూప్‌నకు చెందిన'డాలీ'అనే నౌకగా గుర్తించారు. ఇది బాల్టిమోర్‌ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో ఇద్దరు పైలెట్లు సహా 22 మంది సిబ్బంది ఉండగా.. అందరూ భారతీయులేనని సినెర్జీ మెరైన్‌ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Details 

బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుంది: బైడెన్ 

ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నారు. మొదట నౌకలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారు. కాగా, బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన వెలువడింది. బాల్టిమోర్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఎనిమిది మంది గల్లంతయ్యారని తెలిపారు. వారిలో ఇద్దరిని రక్షించగా, మిగిలిన ఆరుగురు ఆచూకీ తెలియలేదన్నారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. బాల్టిమోర్ పోర్ట్‌లో నౌకల కదలికను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు బైడెన్ చెప్పారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాల్టిమోర్ వంతెన ప్రమాదంపై మాట్లాడుతున్న బైడెన్