తదుపరి వార్తా కథనం
Red Sea tourist boat: ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు.. పదహారు మంది గల్లంతు
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 26, 2024
08:39 am
ఈ వార్తాకథనం ఏంటి
ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంఘటన కలకలం రేపింది.
ఈజిప్టు తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
వీరిలో 31 మంది పర్యాటకులు కాగా, 13 మంది సిబ్బంది అని అధికారులు తెలిపారు.
రెడ్‌సీ గవర్నరేట్ ప్రకారం, ఈ ప్రమాదం నుంచి 28 మందిని రక్షించగలిగారు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు.
వివరాలు
బోటును గట్టిగా ఢీకొట్టిన భారీ అల
బోటు సముద్రంలో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన భారీ అల బోటును గట్టిగా ఢీకొట్టిందని, అందువల్లే బోటు మునిగిపోయిందని అధికారులు వివరించారు.
అల తాకిన సమయంలో, కొంతమంది ప్రయాణికులు తమ క్యాబిన్లలో ఉండటం వల్ల బయటకు వచ్చే అవకాశం లేకుండా చిక్కుకుపోయారని సమాచారం.
గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.