Page Loader
US: తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు: భారతీయ,విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక
తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు: భారతీయ,విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక

US: తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు: భారతీయ,విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

పలు కారణాలవల్ల విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా, తాజాగా మరో కీలక హెచ్చరికను జారీ చేసింది. భారత విద్యార్థులు సహా ఇతర దేశాల విద్యార్థులు తమ విద్యాసంస్థల్లో గైర్హాజరు అయితే , దాని ఆధారంగా వీసాలను రద్దు చేయనున్నట్టు హెచ్చరించింది. ఈ మేరకు, భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

అమెరికా ఎంబసీ హెచ్చరిక 

''మీరు చదువుతున్న విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్‌ అయినా, తరగతులకు హాజరు కాకపోయినా, లేదా ముందుగా తెలియజేయకుండా స్టడీ ప్రోగ్రామ్‌ మధ్యలో వదిలిపెట్టినా, అటువంటి పరిస్థితుల్లో మీ విద్యార్థి వీసా రద్దవుతుంది. ఇక తదుపరి దశలో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు. ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే, విద్యార్థి వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించండి. మీ వీసా నిలబెట్టుకునేందుకు నిబంధనల మేరకు ప్రవర్తించండి'' అని అమెరికా ఎంబసీ హెచ్చరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా ఎంబసీ చేసిన ట్వీట్