LOADING...
USA: అమెరికాను కమ్ముకున్న మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులకు బ్రేక్
అమెరికాను కమ్ముకున్న మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులకు బ్రేక్

USA: అమెరికాను కమ్ముకున్న మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులకు బ్రేక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాను (USA) అతిభీకరమైన మంచు తుపాను (Winter Storm) కుదిపేస్తోంది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తృతంగా మంచు కురుస్తుండగా, వర్షాలు, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్‌, ఓక్లహోమా రాష్ట్రాలపై ఈ మంచు తుపాను తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ మాన్స్టర్‌ వింటర్‌ స్టార్మ్‌ కారణంగా అనేక రాష్ట్రాల్లో విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయని అధికారులు తెలిపారు. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ 'ఫ్లైట్‌అవేర్‌' వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రోజున 3,200 విమానాలు, ఆదివారం 4,800 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో రవాణా సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Details

అప్రమత్తమైన రాష్ట్రాలు.. ఎమర్జెన్సీ అమలు

ఈ మంచు తుపాను ప్రభావంతో అమెరికా వ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సస్‌, ఆర్కాన్సాస్‌, జార్జియా, మిసిసిపి తదితర రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలైన మిసిసిపి, ఫ్లోరిడాలోనూ ప్రమాదకర చలి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Details

భారీగా మంచు కురిసే సూచనలు

అలాగే మిస్సోరి, ఇల్లినాయిస్‌ రాష్ట్రాల్లో భారీగా మంచు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు, విమాన రవాణాకు తీవ్ర అంతరాయం కలగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంచులో వాహనదారులు చిక్కుకుపోయే ప్రమాదం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మంచు తుపాను ఈ దశాబ్దిలోనే అత్యంత తీవ్రమైనదిగా నిలవొచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement