South Korea: మాజీ అధ్యక్షుడు యూన్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్ ఎందుకు వచ్చింది?
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రస్తుతం ఎమర్జెన్సీ వివాదంతో సంబంధించి అభిశంసనను ఎదుర్కొంటున్నారు.
ఇటీవలే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై దర్యాప్తు అధికారులు సూచనలిచ్చారు.
ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు కోర్టులో అనుమతిని కోరినట్లు సమాచారం. న్యాయస్థానం అంగీకరిస్తే,త్వరలోనే ఆయన అరెస్టు చేసే అవకాశం ఉంది.
అలాగే,యూన్ సుక్ యోల్ మార్షల్ లా(Emergency Martial Law)ప్రకటించడంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
న్యాయవాదులు,పోలీసు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ ఈ వ్యవహారంపై విచారణను కొనసాగిస్తోంది.
మూడు సార్లు పిలిచినప్పటికీ,ఆయన విచారణకు హాజరుకాకపోవడం కారణంగా,అధికారులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరినట్లు సమాచారం.
విచారణలో నేరం నిరూపితమైతే,ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించబడే అవకాశముంది.
వివరాలు
పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం
యూన్ సుక్ యోల్ మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు, ఆయనపై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.
ఈ తీర్మానానికి 204 మంది అనుకూలంగా ఓటేయగా, 85 మంది వ్యతిరేకించారు.
దీంతో, యూన్ సుక్ తన అధ్యక్ష అధికారాలను ప్రధానమంత్రి హన్ డక్ సూకి అప్పగించాల్సి ఉంటుంది.
ఈ తీర్మానాన్ని రాజ్యాంగ న్యాయస్థానానికి పంపించనున్నట్లు సమాచారం. యూన్ నిష్క్రమణను కోర్టు 180 రోజుల్లోగా నిర్ణయించాల్సి ఉంటుంది.
వివరాలు
ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్
ఇటీవల, దేశవ్యాప్త తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో, యూన్ సుక్ యోల్ తన ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటనను విరమించుకున్నారు.
అయితే, ప్రతిపక్షాలు ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా, పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అనంతరం, మార్షల్ లా అమలు చట్టవిరుద్ధంగా ప్రకటించబడింది.
యూన్ సుక్ యోల్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఆయన అభిశంసనకు గురయ్యారు.
దీనితో, యూన్ సుక్ యోల్ దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు ప్రకటించారు.