
Air Force One: ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌కు దగ్గరగా.. స్పిరిట్ ప్రయాణికుల విమానం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన భార్య మెలానియా (Melania) ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వారి ప్రయాణం సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ దంపతులు ప్రయాణిస్తున్న ప్రత్యేక రక్షణ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One)కు అత్యంత సమీపంగా ఒక వాణిజ్య విమానం చేరుకోవడంతో కొద్ది సేపు ఆందోళన నెలకొంది. మంగళవారం,స్థానిక సమయానుసారం,ఎయిర్ ఫోర్స్ వన్ లాంగ్ ఐలాండ్ గగనతలాన్ని దాటుతున్న సమయంలో, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ (Spirit Airlines)కు చెందిన 1300వ విమానం దాని దగ్గరికి చేరింది. ఈ పరిస్థితిని గమనించిన న్యూయార్క్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు.
వివరాలు
శ్రద్ధ వహించండి.. ఐప్యాడ్ నుంచి బయటికిరండి
స్పిరిట్ ఎయిర్‌లైన్స్ పైలట్లను అప్రమత్తం చేస్తూ, వారి విమానాన్ని కుడివైపుకు మళ్లించాల్సిందిగా పదేపదే సూచనలు ఇచ్చారు. అయితే, అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, స్పిరిట్ పైలట్లు ప్రారంభంలో ఆ సూచనలను పట్టించుకోకపోవడంతో టవర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రద్ధ వహించండి.. ఐప్యాడ్ నుంచి బయటికిరండి అంటూ పైలట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అప్రమత్తమైన స్పిరిట్ విమానం పైలట్లు వెంటనే దిశ మార్చి, ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఘటనపై స్పిరిట్ ఎయిర్‌లైన్స్ స్పందించింది."మా సంస్థకు భద్రతే మొదటి ప్రాధాన్యం.మా 1300వ విమానం (FLL-BOS) బోస్టన్‌కు బయలుదేరినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన అన్ని ఆదేశాలను పాటించింది. చివరికి విమానం ఎటువంటి సమస్యలు లేకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది"అని ఒక వార్తా సంస్థకు తెలియజేసింది.