Page Loader
Harini Amarasuriya:  శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం
శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం

Harini Amarasuriya:  శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. 1994-2000 కాలంలో సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధానిగా నియమితులైన రెండవ మహిళగా హరిణి ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. హరిణి 54 ఏళ్ల వయసులో నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) పార్టికి చెందిన నాయకురాలిగా ఈ పదవిని స్వీకరించారు. ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా క్యాబినెట్‌లో మరో ఇద్దరు నేతలను కూడా మంత్రులుగా నియమించారు.ఈ నియామకంతో దిసనాయకే ఆధ్వర్యంలో మొత్తం నాలుగు మంది సభ్యులతో కూడిన క్యాబినెట్ కొలువుదీరింది.

వివరాలు 

శ్రీలంక మూడవ మహిళా ప్రధానిగా చరిత్ర

హరిణికి ప్రధానిగా న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలు అప్పగించారు. ఈ పరిణామం, దినేష్ గుణవర్ధన తన పదవికి రాజీనామా చేసిన తరువాత చోటుచేసుకుంది. హరిణి, హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా ప్రసిద్ధి చెందారు, ఇప్పుడు శ్రీలంక మూడవ మహిళా ప్రధానిగా చరిత్ర లిఖించారు. ఎన్‌పీపీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్ మరియు లక్ష్మణ్ నిపుణరచిచి కూడా క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే విజయం సాధించి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్‌ రద్దు అవుతుందని, నవంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.