Page Loader
మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 
మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక

మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది. చైనా పరిశోధన నౌక జియాన్ -6 అక్టోబర్‌లో శ్రీలంకను సందర్శించేందుకు అనుమతి కోరింది. దక్షిణ భారత భద్రతతో పాటు ముఖ్యమైన అంశాలను చైనా పర్యవేక్షించే ప్రమాదం ఉందని శ్రీలంక ఎదుట భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనాకు అనుమతి ఇవ్వొద్దని శ్రీలంకను కోరింది. దీనిపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ చాబ్రీ స్పందించారు. చైనా నౌకకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. దీనిపై తమ మిత్రదేశాలతో మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తమ ప్రాంతాన్ని శాంతియుతంగా ఉంచేందుకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలంక విదేశాంగ మంత్రి ఇంటర్వ్యూ