PM Modi: భారత్‌లో స్టార్టప్ విప్లవం.. 4 యూనికార్న్‌ల నుంచి 100 దాటిన కంపెనీలు: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని, హేగ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో ప్రధాని కరచాలనం చేసి ఆత్మీయంగా మాట్లాడారు. నెదర్లాండ్స్ నాయకత్వంతో తాను ఎప్పుడైనా సమావేశమైనప్పుడు అక్కడి భారతీయుల గురించి ఎంతో ప్రశంసించేవారని మోదీ గుర్తుచేశారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని అన్నారు. కాలం మారుతున్నా భారతీయ సంస్కృతి మాత్రం మారలేదని కొనియాడారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
వివరాలు
సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగవంతం
దేశంలో ప్రతి నెలా 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు. భారత్‌లో ఒకప్పుడు కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 100కు పైగా పెరిగిందన్నారు. దేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 'మేడిన్ ఇండియా' చిప్‌లు తయారవుతున్నాయని తెలిపారు. అలాగే G20 సమ్మిట్‌తో పాటు ఏఐ సమ్మిట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించిందని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య బలాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఈయూ దేశాల మొత్తం జనాభాను కలిపినా 64 కోట్ల మంది కూడా ఉండరని వ్యాఖ్యానించారు.