
Steve Jobs Daughter: ఒలింపిక్ విజేతతో వివాహం.. వైభవంగా స్టీవ్ జాబ్స్ కుమార్తె పెళ్లి వేడుక!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం, యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ (Eve Jobs) వివాహం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్‌కు చెందిన 2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ఈక్వెస్ట్రియన్ విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్న హ్యారి చార్లెస్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఇంగ్లాండ్‌లోని గ్రేట్ ట్యూలోని సెయింట్ మైఖెల్స్ అండ్ ఆల్ ఏంజెల్స్ చర్చిలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 6.7 మిలియన్ డాలర్లు ఖర్చైనట్టు డెయిలీ మెయిల్ వెల్లడించింది.
Details
ప్రముఖ అతిథులతో రిసెప్షన్
వివాహానంతరం రాజసంగా నిర్వహించిన రిసెప్షన్ కోసం నవ దంపతులు ఎస్టెల్లే మానర్ కంట్రీ హోటల్‌ను ప్రత్యేకంగా బుక్ చేశారు. 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్‌లో 100 గదులు, నాలుగు రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్, జిమ్, టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రముఖ అతిథులు హాజరయ్యారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ వేడుకలో పాల్గొన్నారు. సంగీత దిగ్గజం ఎల్టన్ జాన్ ప్రత్యక్షంగా సంగీత ప్రదర్శన అందించారు.
Details
ఎవరీ ఈవ్ జాబ్స్?
స్టీవ్ జాబ్స్-లారెన్ పావెల్ దంపతుల చిన్న కుమార్తె ఈవ్ జాబ్స్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయి, ఫ్యాషన్ మోడలింగ్ రంగంలో పేరుగాంచారు. అంతేకాదు, హార్స్ రైడింగ్‌లోనూ ఆమెకు అపార నైపుణ్యం ఉంది. అండర్-25 కేటగిరీలో ప్రపంచస్థాయిలో ఐదో స్థానంలో నిలిచారు. వయసు 22 సంవత్సరాల్లోనే గ్లోసియర్ హాలిడే క్యాంపెయిన్‌తో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. వోగ్ జపాన్ పత్రిక కవర్ పేజీపై ఆమె ఫోటో ప్రచురితమైంది వధూవరుల బ్యాక్‌గ్రౌండ్ వరుడు హ్యారి చార్లెస్ వయస్సు 26 ఏళ్లు.బ్రిటన్ జట్టు తరఫున పారిస్ ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయానికి అతడు కీలక పాత్ర పోషించాడు. అతని తండ్రి పీటర్ చార్లెస్ కూడా 2012 ఒలింపిక్స్‌లో అదే ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచారు.